కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, పద్మావతి, రేవంత్ రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు
  • సీఎం కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • ఈ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఈసీకి అడ్వకేట్ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేంద్ర కోరారు. మంత్రులపై, తమ కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేశారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.
Go Back to Shorts
Telangana
congress
Revanth Reddy
kcr
cm

More Telugu News